WIPRO Elite NTH-2022

WIPRO Elite NTH-2022

 

విప్రో ఎలైట్‌ నేషనల్‌ టాలెంట్‌ హంట్‌ (ఎన్‌టీహెచ్‌) - 2022

ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థ విప్రో బీఈ/ బీటెక్, ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌ చివరి సంవత్సరం చదువుతోన్న విద్యార్థులకు కోసం ఎలైట్‌ నేషనల్‌ టాలెంట్‌ హంట్‌ (ఎన్‌టీహెచ్‌)-2022 పరీక్షలు నిర్వహించి ఇందులో ఎంపికైనవారిని  ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ హోదాలో నియమించి  రూ.3.5 లక్షల వార్షిక వేతనం ఇస్తారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్లు చేసుకోవాలి. కంప్యూటర్‌ సైన్స్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, సర్క్యూటల్‌ ఇంజినీరింగ్‌ విభాగాల్లో అత్యుత్తమ నైపుణ్యాలున్నవారికి ప్రత్యేకంగా ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు.  

ఈ విధానంలో ఉద్యోగంలో చేరినవారు ఏడాది పాటు సంస్థలో కొనసాగడం తప్పనిసరి. ఇందుకోసం ఉద్యోగంలో చేరే వారు రూ.75,000 విలువైన ఒప్పందపత్రం రాయాల్సి ఉంటుంది.

 అర్హతలు

  • పదో తరగతి కనీసం 60 శాతం మార్కులు సాధించాలి. 
  • ఇంటర్మీడియట్‌లో కనీసం 60 శాతం మార్కులు సాధించాలి. 
  • బీటెక్‌/బీఈ/ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌లో 60 శాతం తప్పనిసరి. 
  • 2021,  2022లో  కోర్సులు పూర్తిచేసుకుంటున్నవారు అర్హులు. 
  • ఫాషన్ టెక్నాలజీ, టెక్స్టైల్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫుడ్ టెక్నాలజీ బ్రాంచులు వారికీ తప్ప మిగతా అన్ని భ్రాంచ్ లకు చెందిన విద్యార్థులకు అవకాశం కల్పించారు. 
  • పదో తరగతి నుంచి గ్రాడ్యుయేషన్‌ మధ్య అకడమిక్‌ విరామం మూడేళ్లకు మించి ఉండరాదు. 
  • ఎంపిక ప్రక్రియ మొదలయ్యే సమయానికి సబ్జెక్టు లలో ఒకటి కంటే ఎక్కువ ఎరియర్స్‌ సబ్జెక్టులు ఉండరాదు.
  • గత 6 నెలలలో విప్రో సెలక్షన్ లకు హాజరయిన వారికీ ఇందులో అర్హత లేదు.

ఎంపిక విధానం 

  • ఆన్‌లైన్‌ అసెస్‌మెంట్‌తో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
  • పరీక్షలో అర్హత సాధించినవారికి టెక్నికల్, హెచ్‌ఆర్‌ ఇంటర్వ్యూలు ఉంటాయి. వీటిలోనూ ప్రతిభ చూపితే శిక్షణకు ఎంపికచేస్తారు.  
  • విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నఅభ్యర్థులను ఉద్యోగంలో నియమిస్తారు.

పరీక్ష విధానం 

  1. ఆప్టిట్యూడ్‌: లాజికల్‌ ఎబిలిటీ, క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ, ఇంగ్లిష్‌ (వెర్బల్‌) ఎబిలిటీ అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు. దీనికి గాను 48 నిమిషాల వ్యవధిని కేటాయిస్తారు.  
  2. రిటన్‌ కమ్యూనికేషన్‌: ఇందులో వ్యాసం రాయాల్సి ఉంటుంది. దీనికి 20 నిమిషాల వ్యవధి ఉంటుంది.  
  3. ఆన్‌లైన్‌ ప్రోగ్రామింగ్‌: కోడింగ్‌లో 2 ప్రోగ్రామ్‌లు రాయాల్సి ఉంటుంది. ఇందుకోసం జావా, సీ, సీ++, పైతాన్‌ వీటిలో దేనినైనా ఎంచుకోవచ్చు. దీనికి 60 నిమిషాల వ్యవధి కేటాయిస్తారు.  

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: మే 22, 2022

అసెస్‌మెంట్‌ పరీక్షలు: మే 21-జూన్ 5, 2022

వెబ్‌సైట్‌

https://careers.wipro.com/elite