NIMCET-2022 NOTIFICATION
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లలో ఎం.సి.ఎ. కోర్సు ప్రవేశాలకు
నిమ్ సెట్ - 2022 నోటిఫికేషన్ విడుదల
జాతీయ స్థాయిలో ప్రఖ్యాత సంస్థలైన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రవేశాలకు గాను దేశవ్యాప్తంగా నిర్వహించే నిట్ ఎంసీఏ కామన్స్ ఎంట్రన్స్ టెస్ట్ (నిమ్ సెట్)-2022 ప్రవేశ ప్రకటన విడుదలైనది. ఇందులో అర్హత సాధిస్తే దేశంలోని ప్రముఖ నిట్ లలో మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (ఎంసీఏ) కోర్సు చదివే అవకాశం కల్పిస్తారు.
అర్హత
అభ్యర్థులు 60 శాతం మార్కులతో మ్యాథమెటిక్స్/ స్టాటిక్స్ ఒక సబ్జెక్టుగా ఏదైనా మూడేళ్ల ఫుల్ టైం బీఎస్సీ/ బీఎస్సీ (హానర్స్)/ బీసీఏ/ బిట్/బ్యాచిలర్ ఆఫ్ ఒకేషనల్ (కంప్యూటర్ సైన్స్) కంప్యూటర్ అప్లికేషన్స్)/ బీబీఏ (కంప్యూటర్ అప్లికేషన్స్) లేదా బీఈ/ బీటెక్ కోర్సుల్లో ఉత్తీర్ణులై ఉండాలి.
ప్రవేశ పరీక్ష విధానం :
- ఆన్లైన్ విధానంలో నిర్వహించే ఈ పరీక్షలో మొత్తం 120 ప్రశ్నలు ఉంటాయి.
- ప్రశ్నలన్నీ మల్టిపుల్ చాయిస్ విధానంలోనే ఉంటాయి.
- మ్యాథమేటిక్స్ (50 ప్రశ్నలు), అనలైటికల్ ఎబిలిటీ అండ్ లాజికల్ రీజనింగ్ (40 ప్రశ్నలు), కంప్యూటర్ అవేర్ నెస్ (10 ప్రశ్నలు), జనరల్ ఇంగ్లిష్ నుంచి 20 ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి రెండు గంటలు.
- ప్రశ్నపత్రం కేవలం ఇంగ్లిష్ మాధ్యమంలో ఉంటుంది. ప్రతి సరైన సమాధానానికి 4 మార్కుల చొప్పున కేటాయిస్తారు. తప్పు సమాధానానికి 1 మార్కు కోత విధిస్తారు.
ఎంపిక విధానం
ఉమ్మడి ప్రవేశ పరీక్షలో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా ర్యాంకులు కేటాయిస్తారు.
వాటిని బట్టి ఆయా విశ్వవిద్యాలయాలు కౌన్సెలింగ్ నిర్వహించి ప్రవేశాలు కల్పిస్తాయి.
వివిధ సంస్థల్లో సీట్ల వివరాలు:
మొత్తం సీట్లు 951 . నిట్-అగర్తల(30), ఎం.ఎన్.నిట్-అలహాబాద్(116), ఎం.ఎ.నిట్-భోపాల్ (115), జంషెడ్ పూర్(115), కురుక్షేత్ర(96), పట్నా(80), రాయ్ పూర్(110), సూరత్కల్(58), తిరుచిరాపల్లి(115), వరంగల్ (58) సీట్లు ఉన్నాయి.
దరఖాస్తు విధానం : అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : మే 4, 2022.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు : హైదరాబాద్, వరంగల్, విజయవాడ
పరీక్ష తేదీ : జూన్ 20, 2022
పరీక్ష ఫీజు : ఇతరులకు రూ. 2,500. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ. 1250.
పూర్తి వివరాలకు అధికారిక వెబ్సైటు సందర్శించండి
Website : https://www.nimcet.in/