AIST-2022 ADMISSIONS FOR FOOTWARE COURSES
ఫుట్‌వేర్ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్(ఎఫ్‌డీడీఐ)లో
బ్యాచిలర్, పీజీ కోర్సులకు ఏఐఎస్‌టీ–2022 ప్రవేశ ప్రకటన
కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఫుట్‌వేర్ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ (ఎఫ్‌డీడీఐ)లో 2022-23 విద్య సంవత్సరానికి గాను బ్యాచిలర్ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులకు ప్రకటన వెలువడినది. ఈ సంస్థకు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పాట్నా, కోల్‌కత, నోయిడా, జోథ్‌పూర్, అంక్లేశ్వర్, గుణ, ఛింద్వారా, ఫర్సత్‌గంజ్, రోహ్‌తక్, చండీగఢ్, హైదరాబాద్, చెన్నై కేంద్రాల్లో 12 క్యాంపస్‌లు కలవు.
సీట్ల వివరాలు :
బ్యాచిలర్ ప్రోగ్రామ్స్‌లో 1800 సీట్లు, పీజీ ప్రోగ్రామ్స్‌లో 360 సీట్లు అందుబాటులో గలవు.
బ్యాచిలర్ ప్రోగ్రామ్‌లు
బ్యాచిలర్ ఆఫ్ డిజైన్–ఫుట్‌వేర్ అండ్ ప్రొడక్షన్
బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ – ఫ్యాషన్
బ్యాచిలర్ ఆఫ్ డిజైన్–లెదర్ గూడ్స్ అండ్ యాక్ససరీస్
బీబీఏ – రిటైల్ అండ్ ఫ్యాషన్ మర్కండైజ్
అర్హత
ఇంటర్మీడియెట్ తత్సమాన కోర్సు ఉత్తీర్ణత.
పీజీ ప్రోగ్రామ్‌లు
ఎం.డిజైన్ – ఫుట్‌వేర్ డిజైన్ అండ్ ప్రొడక్షన్
ఎంబీఏ – రిటైల్ అండ్ ఫ్యాషన్ మర్కండైజ్
అర్హత
మాస్టర్ ఆఫ్ డిజైన్:
ఫుట్‌వేర్ డిజైన్ అండ్ ప్రొడక్షన్: ఫుట్‌వేర్/లెదర్ గూడ్స్ అండ్ యాక్సెసరీస్ డిజైన్/ఫ్యాషన్/ఇంజనీరింగ్/ఫైన్‌ఆర్ట్స్/ఆర్కిటెక్చర్ విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.
ఎంబీఏ(రిటైల్ అండ్ ఫ్యాషన్ మర్చెండైజ్): గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.
కోర్సు చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా అర్హులే.
ప్రవేశ విధానం:
ఎఫ్‌డీడీఐ క్యాంపస్‌లలో అందుబాటులో ఉన్న యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశానికి వేర్వేరుగా ఆల్ ఇండియా సెలక్షన్ టెస్ట్(ఏఐఎస్‌టీ)ను నిర్వహిస్తారు. పరీక్షలలో అభ్యర్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగా కౌన్సిలింగ్ నిర్వహించి ప్రవేశాలు కల్పిస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 28 -04- 2022ఏఐఎస్‌టీ పరీక్ష తేదీ: జూన్ 19 -6- 2022