NTSE-2020
10వ తరగతి విద్యార్థులకు ఎన్.టి.ఎస్.ఈ. స్కాలర్షిప్ పరీక్ష
10వ తరగతి విద్యార్థుల ప్రతిభను పరీక్షించి, వారికి ఆర్థిక చేయూతనందించే లక్ష్యంతో ప్రతి సంవత్సరం నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ (ఎన్‌టీఎస్ఈ) నిర్వహిస్తున్నారు. ఎన్‌సీఈఆర్‌టీ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో జరిగే ఈ పరీక్షలో ఎంపికైతే ఇంటర్మీడియట్ నుంచి పీహెచ్‌డీ వరకు విద్యార్థులు స్కాలర్షిప్‌లు పొందవచ్చును. దేశవ్యాప్తంగా రెండు వేల మందికి ఈ స్కాలర్షిప్‌లు అందుతాయి. పేద, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన విద్యార్థులకు ఎన్టీఎస్ఈ ఒక వరంలాంటిది. ఈ పరీక్ష రెండు దశల్లో జరుగుతుంది. మొదటిది స్టేజ్-1 రాష్ట్రస్థాయి, రెండోది స్టేజ్-2 జాతీయ స్థాయిలో జరుగుతుంది.
అర్హత:
గుర్తింపు పొందిన అన్ని పాఠశాలలకు చెందిన పదోతరగతి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఓపెన్ స్కూల్లో చదివిన వారూ అర్హులే.
దరఖాస్తు విధానం
పరీక్ష రుసుము రూ.200 ఆన్‌లైన్‌లో చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. సంబంధిత ప్రతులను జిల్లా విద్యాధికారి కార్యాలయానికి పంపించాలి.
ఎంపిక
అర్హుల జాబితా నుంచి ప్రతిభావంతులను, రిజర్వేషన్ల ప్రాతిపదికన 2000 మందిని స్కాలర్‌షిప్‌నకు ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి ఇంటర్మీడియట్‌లో నెలకు రూ.1250, డిగ్రీ, పీజీ కోర్సులు చదువుతున్నప్పుడు నెలకు రూ.2000 చొప్పున చెల్లిస్తారు. పీహెచ్‌డీ చేరిన వారికి యూజీసీ నిబంధనల ప్రకారం స్కాలర్‌షిప్ అందిస్తారు.
సిలబస్
మెంటల్ఎబిలిటీ టెస్ట్(మ్యాట్)లో విద్యార్థుల రీజనింగ్ సామర్థ్యాన్ని పరిశీలిస్తారు. ఎనాలజీస్, క్లాసిఫికేషన్, సిరీస్, కోడింగ్ - డీ కోడింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అంశాలపై ప్రశ్నలు వస్తాయి. స్కాలస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్(సాట్) విభాగంలో పదో తరగతి సిలబస్ నుంచి ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నపత్రం తెలుగు, హిందీ, ఇంగ్లిష్, ఉర్దూ మాధ్యమంలో ఉంటుంది.
పరీక్షా విధానం
రాష్ట్రస్థాయిలో..
రాష్ట్రస్థాయిలో జరిగే స్టేజ్-1 (స్టేట్ లెవెల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్) ముల్టీపుల్ ఛాయిస్ పరీక్ష విధానంలో ఉంటుంది. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. మొదటిది మెంటల్ఎబిలిటీ టెస్ట్, రెండోది స్కాలస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్. ప్రతి పేపర్లో 100 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున ఉంటుంది. రెండవ పేపర్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్, హిస్టరీ, జాగ్రఫీ, పొలిటికల్సైన్స్, ఎకనామిక్స్ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో పేపర్ వ్యవధి రెండు గంటలు.
స్టేజ్-1 పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు మాత్రమే స్టేజ్-2 (ఎన్టీఎస్ఈ) రాసే అవకాశం లభిస్తుంది. స్టేజ్-2 ప్రశ్నపత్రం కూడా స్టేజ్-1 మాదిరిగానే ఉంటుంది. కాకపోతే ప్రశ్నల స్థాయి కొంచెం పెరుగుతుంది. రుణాత్మక మార్కులు ఉండవు. పేపర్లవారీ కనీస అర్హత మార్కులు సాధించడం తప్పనిసరి.
పరీక్ష కేంద్రాలు: దాదాపు అన్ని జిల్లా కేంద్రాల్లో పరీక్ష కేంద్రం ఉంటుంది.
ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు చివరి తేది: నవంబరు 06, 2020
ఫీజు చెల్లింపునకు చివరి తేది: నవంబరు 09, 2020
దరఖాస్తు ప్రతుల సమర్పణకు చివరి తేది: నవంబరు 12, 2020
పరీక్ష తేదీ: స్టేజ్-1 13.12.2020 (పేపర్ -1, ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు, పేపర్-2 మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు)
వెబ్‌సైట్
ఆంధ్రప్రదేశ్
https://www.bse.ap.gov.in/NTSE.aspx
తెలంగాణ
https://www.bse.telangana.gov.in/NTSE.aspx